niharika: పల్లెటూరి ప్రేమకథను పూర్తి చేసిన నిహారిక!

  • నిహారిక తాజా చిత్రంగా 'హ్యాపీ వెడ్డింగ్'
  • పల్లె నేపథ్యంలో సాగే ప్రేమకథ 
  • భారీ సంఖ్యలో సీనియర్ ఆర్టిస్టులు   

తెలుగు తెరకి 'ఒక మనసు' సినిమాతో మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారిక పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, నటన పరంగా నిహారికకి మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న నిహారిక, 'హ్యాపీ వెడ్డింగ్' అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా చేసిన ఈ సినిమా ద్వారా లక్ష్మణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పార్టును పూర్తిచేసుకుందనీ .. మంచి టీమ్ తో కలిసి వర్క్ చేసినందుకు ఆనందంగా ఉందని నిహారిక చెప్పింది. ఇది పల్లెటూరి నేపథ్యంగా సాగే ప్రేమకథ .. అక్కడి కుటుంబాల మధ్య చోటుచేసుకున్న అనుబంధాల కథ. ఈ సినిమాలో సీనియర్ ఆరిస్టులు చాలామంది ఉన్నారట. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని నిహారిక భావిస్తోంది.       

  • Loading...

More Telugu News