deepika padukone: దీపికా పదుకునే చిరకాల కోరిక నెరవేరింది!

  • లండన్ లో ఇల్లు కొనుక్కోవాలన్న కోరిక
  • కొత్త ఇల్లు కొన్న బాలీవుడ్ భామ
  • 'పద్మావతి' రీలీజ్ తర్వాత లండన్ చెక్కేస్తున్న దీపిక
లండన్ లో సొంత ఇల్లు ఉండాలనే చిరకాల కోరికను బాలీవుడ్ భామ దీపికా పదుకునే నెరవేర్చుకుంది. లండన్ నగరంలోని ఓ పాష్ నివాస ప్రాంతంలో దీపిక ఓ ఇంటిని కొనుగోలు చేసింది. 'పద్మావతి' సినిమా నేపథ్యంలో దీపిక చాలా వార్నింగ్ లు, ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, ఈ చిత్రం విడుదల కాగానే లండన్ చెక్కేసి, తన సొంత నివాసంలో కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని ఆమె భావిస్తోంది. లండన్ ఇంట్లో విశ్రాంతి అనంతరం, కొత్త సినిమాల్లో నటించే విషయంలో నిర్ణయం తీసుకుంటుందట. మరోవైపు, బాలీవుడ్ స్టార్ హీర్ రణ్ వీర్ సింగ్ ను దీపిక పెళ్లాడబోతోందనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. రణ్ వీర్ తల్లిదండ్రులు దీపికకు ఓ విలువైన బహుమతిని కూడా ఇచ్చారని చెప్పుకుంటున్నారు.
deepika padukone
bollywood
deepika new house in london

More Telugu News