సమంత అందానికి కారణం ఇదేనట!
- గ్లామర్ రహస్యాన్ని వెల్లడించిన సమంత
- శామ్ సీక్రెట్ 'యాపిల్ సిడర్ వెనిగర్'
- గూగుల్ లో ఎన్నో రెసిపీలు ఉన్నాయంటూ సూచన
తాజాగా తన గ్లామర్ సీక్రెట్ ను సమంత బయటపెట్టింది. 'యాపిల్ సిడర్ వెనిగర్' తన అందం వెనుకున్న రహస్యం అని ఈ అక్కినేని వారి కోడలు తెలిపింది. 'ప్రతి రోజూ ఉదయం పరగడుపున యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకోండి' అంటూ తన అభిమానులకు సూచించింది. గూగుల్ లో వెతికితే మరెన్నో రెసిపీలు కనపడతాయని చెప్పింది.