anil: మ‌ళ్లీ తెర మీద‌ మేజిక్ చేయ‌బోతున్న అనిల్ - మాధురీల జంట‌

  • 17 ఏళ్ల త‌ర్వాత క‌లిసి న‌టించ‌బోతున్న బాలీవుడ్ జంట‌
  • 'టోటల్ ధ‌మాల్' హాస్య చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు
  • చివ‌రిగా 'పుకార్‌'లో న‌టించిన అనిల్ - మాధురీ

వెండితెర మీద కొన్ని జంట‌లు ప్రేక్ష‌కుల మ‌నసును దోచేస్తాయి. తెర మీద వారి కెమిస్ట్రీకి జ‌నాలు ఫిదా అయిపోతుంటారు. బాలీవుడ్‌లో అనిల్ క‌పూర్ - మాధురీ దీక్షిత్‌ల‌ది అలాంటి జంటే. ఈ హిట్ కాంబినేషన్ మ‌ళ్లీ 17 ఏళ్ల త‌ర్వాత అదే మేజిక్‌ను తెర మీద సృష్టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. 'ధ‌మాల్‌', 'డ‌బుల్ ధ‌మాల్' సిరీస్‌లో భాగంగా తెర‌కెక్కుతున్న 'టోట‌ల్ ధ‌మాల్' చిత్రంలో వీరు క‌లిసి న‌టించ‌బోతున్నారు. చివ‌రిగా వీరిద్ద‌రూ 'పుకార్' చిత్రంలో న‌టించారు. 2000 సంవ‌త్స‌రంలో ఈ చిత్రం విడుద‌లైంది.

అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్న ఈ చిత్రానికి ఇంద్ర‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. గ‌త రెండు చిత్రాల‌కు కూడా ఈయ‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వీరితో పాటు ఈ చిత్రంలో బొమ‌న్ ఇరానీ, అర్ష‌ద్ వార్సీలు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నారు. ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ‌మైంది. డిసెంబ‌ర్ 7న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

More Telugu News