china: చేయి చేయి క‌లిపి.. తల్లీపిల్ల‌ల ప్రాణాల‌ను కాపాడిన ప‌ర్యాట‌కులు.. మీరూ చూడండి!

  • మంచుతో గ‌డ్డ‌క‌ట్టుకు పోయిన స‌రస్సులో చిక్కుకుపోయిన త‌ల్లీపిల్ల‌లు
  • విషయాన్ని గుర్తించి వెంటనే కాపాడిన పర్యాటకులు
  • తల్లీపిల్లలకు స్వల్పంగా గాయాలు
  • ఉత్త‌ర చైనాలోని టాంగ్‌షాన్ సిటీలో ఘటన

మంచుతో గ‌డ్డ‌క‌ట్టుకు పోయిన స‌రస్సులో ప‌డిపోయిన త‌ల్లీపిల్ల‌ల‌ను తోటి ప‌ర్యాట‌కులు స‌మ‌య‌స్ఫూర్తితో కాపాడిన ఘ‌ట‌న ఉత్త‌ర చైనాలోని టాంగ్‌షాన్ సిటీలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే ఓ త‌ల్లి త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో టాంగ్‌షాన్ సిటీలోని ఓ ప‌ర్యాట‌క ప్ర‌దేశాన్ని చూడడానికి వచ్చింది. అక్కడ మంచుతో గ‌డ్డ‌క‌ట్టుకుపోయిన స‌రస్సులోకి త‌న పిల్ల‌ల‌తో క‌లిసి వెళ్లింది. ఒక్క‌సారిగా మంచు గ‌డ్డ‌ల్లోకి వారి కాళ్లు దిగిపోయాయి. వారు మునిగిపోతుండడంతో గట్టిగా కేక‌లు వేశారు. ఈ విష‌యాన్ని గుర్తించిన అక్క‌డి వారు దాదాపు 10 మంది ఒక‌రి చేతిని మ‌రొక‌రు ప‌ట్టుకుని ఆ త‌ల్లీపిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు లాక్కొచ్చారు. ఈ ఘ‌ట‌న‌లో స‌ద‌రు త‌ల్లీపిల్ల‌ల‌కు స్వ‌ల్పంగా గాయాల‌య్యాయి.  

More Telugu News