Pawan Kalyan: ‘హైపర్’ ఆదికి అజ్ఞాతవాసి బాగా నచ్చేసిందట!

  • మిగిలిన నటీనటుల కోసమైతే వీలున్నప్పుడల్లా చూడొచ్చు
  • ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ‘బ్లాక్ బస్టర్’
  • ‘రాజ్యం మీద ఆశ లేనోడికంటే గొప్పరాజు ఎవడుంటాడు’ అనే డైలాగ్ నాకు బాగా నచ్చింది : ‘హైపర్’ ఆది

ఈరోజు విడుదలైన ‘అజ్ఞాతవాసి’ సినిమాను చూశానని, తనకు నచ్చిందని ‘జబర్దస్త్ ’ నటుడు ‘హైపర్’ ఆది అన్నాడు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ కోసం పదిసార్లు, త్రివిక్రమ్ కోసం మూడుసార్లు ఈ సినిమా చూడొచ్చని, మిగిలిన నటీనటుల కోసమైతే వీలున్నప్పుడల్లా ఈ సినిమాకు వెళ్లొచ్చని, ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ‘బ్లాక్ బస్టర్’ అని చెప్పొచ్చని అన్నాడు. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ చెప్పే డైలాగ్, ‘రాజ్యం మీద ఆశ లేనోడికంటే గొప్పరాజు ఎవడుంటాడు?’ తనకు బాగా నచ్చిందని, పవన్ కల్యాణ్ కు కరెక్టుగా సరిపోయే డైలాగ్ ఇదని అన్నాడు.

More Telugu News