Revanth Reddy: కేసీఆర్‌కు చీకటి ఒప్పందాలున్నాయి: రేవంత్ రెడ్డి

  • విద్యుత్ ఎంతైనా కొనుగోలు చేస్తామని కేసీఆర్ అంటున్నారు
  • ఆయన వ్యాఖ్య‌లు రైతులపై ప్రేమతో కాదు 
  • త‌మ‌కు వ‌చ్చే కమీషన్‌ పైనే  
  • విద్యుత్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్ర‌భుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి

రాష్ట్రంలోని రైతుల కోసం విద్యుత్ ఎంతైనా కొనుగోలు చేస్తామని, నిరంత‌ర విద్యుత్ అందిస్తామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తోన్న వ్యాఖ్యలు రైతులపై ప్రేమతో కాదని, అందులో చీకటి ఒప్పందాలున్నాయని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ త‌మ‌కు వ‌చ్చే కమీషన్‌ పైనే శ్ర‌ద్ధ చూపుతున్నార‌ని ఆరోపించారు.

ఈ రోజు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తక్కువ ధరకే విద్యుత్‌ ఇస్తామని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతున్నప్ప‌టికీ కేసీఆర్ చ‌త్తీస్‌గఢ్‌తో క‌మీష‌న్ల కోస‌మే ఒప్పందాలు చేసుకున్నార‌ని అన్నారు. తెలంగాణ‌లోని విద్యుత్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్ర‌భుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. తెలంగాణ స‌ర్కారు ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ ఎందుకు కొనుగోలు చేస్తోంద‌ని నిల‌దీశారు. నిరంత‌ర విద్యుత్ కొనుగోళ్ల వెనుక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోప‌ణ‌లు చేశారు. 

More Telugu News