sidda ramaiah: అందరి ముందు నిద్రపోయిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య!

  • మడికేరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నిద్రపోయిన సీఎం
  • సోషల్ మీడియాలో ఫొటో వైరల్
  • గతంలోనూ పలుసార్లు ఇలాగే నిద్రపోయిన సిద్ధరామయ్య
ఓ కార్యక్రమానికి హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అందరూ చూస్తుండగానే నిద్రపోయారు. ఆయన నిద్రపోతుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సిద్ధరామయ్య తీరుపై జోకులు వేసుకుంటున్నారు. 'ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే', 'సిద్ధ రామయ్య.. దయ చేసి తొందరగా నిద్ర లేవండి', 'పని చేసేటప్పుడు నిద్రపోకూడదు' అంటూ ఇలా రకరాలుగా సెటైర్లు వేస్తున్నారు. మడికేరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సిద్ధరామయ్య ఇలా నిద్రపోయారు. ఆయన ఇలా గతంలోనూ అందరి ముందు నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి.
sidda ramaiah
Karnataka
cm

More Telugu News