Anchor Ravi: మహిళలను కించపరిచిన కేసులో ... కోర్టుకు హాజరైన యాంకర్ రవి!

  • 'రారండోయ్ వేడుక చూద్దాం' ఫంక్షన్ లో ఘటన
  • మహిళలను కించపరిచేలా మాట్లాడిన చలపతిరావు
  • 'సూపర్ సార్' అన్న యాంకర్ రవి
  • కేసు విచారణ వాయిదా
ఈ ఉదయం యాంకర్ రవి నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. గతంలో 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో ఫంక్షన్ జరిగిన వేళ, 'అమ్మాయిలు పడుకోడానికే' అని సీనియర్ నటుడు చలపతిరావు వ్యాఖ్యానించగా, 'సూపర్ సార్' అని యాంకర్ రవి సమర్థించిన సంగతి తెలిసిందే. దీంతో మహిళలను కించపరిచారన్న అభియోగాలతో రవిపై కేసు నమోదైంది.

కోర్టు వాయిదా నిమిత్తం రవి వచ్చాడు. ఆపై తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, తన మాటలను మీడియా వక్రీకరించిందని, కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం తానేమీ వ్యాఖ్యానించలేనని చెప్పాడు. కేసు విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తానని అన్నాడు. కాగా, కేసు తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.
Anchor Ravi
Chalapatirao
Nampalli Court

More Telugu News