Trivikram Srinivas: త్రివిక్రమ్ అద్భుతమైన అస్త్రాన్ని వదిలాడు: పరుచూరి గోపాలకృష్ణ

  • కలెక్షన్ల సునామీని చూడబోతున్నాం
  • నాలుగు రోజుల ముందే సంక్రాంతి
  • పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసల వర్షం

త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో నేడు విడుదలైన 'అజ్ఞాతవాసి'పై ప్రముఖ డైలాగ్ రైటర్, నటుడు పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ అద్భుతమైన అస్త్రాన్ని వదిలాడని వ్యాఖ్యానించిన ఆయన, కలెక్షన్ల సునామీని కళ్లజూడనున్నామని తెలిపారు. ఈ ఉదయం సినిమా గురించి మాట్లాడిన ఆయన, పవన్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు నాలుగు రోజుల ముందే సంక్రాంతి పండగ వచ్చిందని చెప్పారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

More Telugu News