joyalukkas: ప్రముఖ నగల దుకాణం జాయ్ అలుక్కాస్ షోరూంలపై ఐటీ దాడులు

  • ట్యాక్స్ లు ఎగ్గొట్టిన జాయ్ అలుక్కాస్
  • ఉదయం నుంచి ఐటీ దాడులు
  • 11 దేశాల్లో కార్యకలాపాలు
ట్యాక్స్ లు ఎగ్గొట్టారనే కారణంగా ప్రముఖ నగల దుకాణం జాయ్ అలుక్కాస్ షోరూమ్ లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. చెన్నైలోని పలు షోరూంలపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను అధికారులు మాట్లాడుతూ, అన్ని వివరాలను తర్వాత ప్రకటిస్తామని చెప్పారు.

భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో జాయ్ అలుక్కాస్ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఇండియా, యూకే, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, సింగపూర్, సౌదీ అరేబియా, మలేషియా, అమెరికా, యూఏఈ దేశాల్లో ఈ సంస్థ వ్యాపారం చేస్తోంది. దాదాపు 130 షోరూమ్ లు ఈ సంస్థకు ఉన్నాయి. 
joyalukkas
it raids on joyalukkas
it raids

More Telugu News