Lago Wynch: దురదృష్టవశాత్తూ నా సినిమాకు కాపీయే: 'అజ్ఞాతవాసి'పై 'లార్గో వించ్' దర్శకుడు జెరోమ్ సాలీ సంచలన కామెంట్

  • నిజమైన కత్తి మహేష్ ఆరోపణలు
  • గత రాత్రి చిత్రం చూసిన జెరోమ్ సాలీ
  • అభిమానుల హడావుడి నచ్చిందని వ్యాఖ్య

కత్తి మహేష్ ఆరోపణలు నిజమయ్యాయి. త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ తాజా సినిమా 'అజ్ఞాతవాసి' తన సినిమాకు కాపీయేనని ఫ్రెంచ్ చిత్రం 'లార్గో వించ్' దర్శకుడు జెరోమ్ సాలీ వ్యాఖ్యానించారు. గత రాత్రి లీ బ్రాడీలోని మెట్రో 4 థియేటర్ లో 7.45 గంటల షోను చూసిన ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. తాను సినిమాను చూశానని, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు.

ఈ సినిమా తనకు కూడా నచ్చిందని, అయితే, దురదృష్టవశాత్తూ ఈ సినిమా కథ, తన చిత్ర కథకు చాలా దగ్గరగా ఉందని చెప్పారు. కాగా, ఈ చిత్రం 'లార్గో వించ్' చిత్రానికి కాపీ అని గతంలోనే కత్తి మహేష్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథపై తమకు స్పష్టత ఇవ్వాలని 'లార్గో వించ్' భారత హక్కులను సొంతం చేసుకున్న టీ-సిరీస్ నుంచి 'అజ్ఞాతవాసి' నిర్మాతలకు నోటీసులు కూడా అందాయి. ఇక జెరోమ్ సాలీ ట్వీట్ ను చూసిన వారు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

More Telugu News