బ్రేకింగ్ న్యూస్... కరేబియన్ దీవుల్లో భారీ భూకంపం... సునామీ హెచ్చరిక జారీ!

10-01-2018 Wed 09:15
  • 7.8 తీవ్రతతో భూకంపం
  • పసిఫిక్ మహా సముద్రంలో 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం
  • అమెరికా సహా పలు దేశాలకు సునామీ హెచ్చరిక
కొద్దిసేపటి క్రితం కరేబియన్ దీవుల్లో భారీ భూకంపం సంభవించిందని, దీని కారణంగా సునామీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియొలాజికల్ సర్వే ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. 7.8 తీవ్రతతో సంభవించిన భూకంప కేంద్రం, హోండూరస్, క్యూబా మధ్య పసిఫిక్ మహాసముద్రంలో 10 కిలోమీటర్ల దిగువన ఉందని తెలిపింది. ప్యూర్టో రికో, యూఎస్ తీర ప్రాంతాలు, వర్జిన్ ఐలాండ్స్ తదితర ప్రాంతాలను సునామీ అలలు తాకవచ్చని హెచ్చరించింది. ప్రజలు తీరానికి సాధ్యమైనంత దూరానికి జరగాలని తెలిపింది.