prasad labs: 'అజ్ఞాతవాసి' సినిమా చూస్తున్న కత్తి మహేష్... బయటకొచ్చి ఏం చెబుతాడో!

  • ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రత్యేక షో
  • సినిమా చూసేందుకు వచ్చిన కత్తి మహేష్
  • గతంలో 'లార్జో వించ్'ని కాపీ కొట్టారని ఆరోపించిన కత్తి

ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేసుకున్నారని, తన అభిమానులను నియంత్రించడంలో పవన్ విఫలమయ్యాడని ఆరోపిస్తూ, వార్తల్లో నిలిచిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్, ఈ ఉదయం 'అజ్ఞాతవాసి' చిత్రం చూసేందుకు వెళ్లాడు. బంజారాహిల్స్ ప్రసాద్స్ ల్యాబ్స్ లో ఉదయం 8 గంటలకు వేసిన షోకు ఆయన హాజరయ్యాడు. సినిమా చూసి వచ్చిన తరువాత మాట్లాడతానని ఆయన చెప్పాడు. కాగా, ఈ చిత్రం ఫ్రెంచ్ సినిమా 'లార్గో వించ్'కి కాపీయని గతంలో కత్తి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన సినిమా చూసి వచ్చి ఎలా స్పందిస్తాడన్న ఆసక్తి నెలకొంది.

More Telugu News