guava: బాలుడి ప్రాణాలు తీసిన జామకాయ!

  • స్కూలుకి జామకాయ, కత్తి తీసుకెళ్లిన బాలుడు
  • తొడపై జామకాయ పెట్టి కోయాలని చూసిన విద్యార్థి
  • తొడ నుంచి గుండెకు అనుసంధానమై ఉండే ప్రధానమైన నరం తెగిపోయిన వైనం

జామకాయ కారణంగా ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడు ఆనైమలైలోని మొయిదిన్‌ఖాన్‌ వీధిలో చోటు చేసుకుంది. అన్సాద్‌ (14) అనే బాలుడు ఓ జామకాయ, చిన్న కత్తిని జేబులో పెట్టుకుని పాఠశాలకు వెళ్లాడు. మొదటి పీరియడ్ ముగియగానే విరామ సమయంలో తాను తెచ్చిన జామకాయను బయటకు తీశాడు. దాన్ని తొడమీద ఉంచుకుని కత్తితో కట్ చేయాలని చూశాడు. ఈ క్రమంలో కత్తితో దాన్ని గట్టిగా కొట్టాడు.

ఆ కత్తి జామకాయకు తగలకుండా తొడకు తగిలింది. దీంతో అక్కడే సృహ తప్పిపడిపోయాడు. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. గుండెకు అనుసంధానమై ఉండే ప్రధానమైన నరం కత్తిపోటుకు గురై తెగిపోవడమే ఆ బాలుడి ప్రాణాలు పోవడానికి కారణమని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

  • Loading...

More Telugu News