anchor pradeep: యాంక‌ర్ ప్ర‌దీప్‌కి నోటీసులు పంపించిన ట్రాఫిక్‌ పోలీసులు

  • రేపు త‌ప్ప‌నిస‌రిగా కోర్టుకి హాజ‌రు కావాల‌ని ఆదేశం
  • రేపు కోర్టు ముందుకు సీజ్ చేసిన ప్ర‌దీప్ కారు
  • కొత్త సంవ‌త్స‌రం రోజున డ్రంకెన్‌డ్రైవ్‌లో అరెస్టైన ప్ర‌దీప్‌
మ‌ద్యం తాగి డ్రైవ్ చేసి ప‌ట్టుబ‌డిన కేసులో భాగంగా యాంక‌ర్ ప్ర‌దీప్‌ను రేపు కోర్టుకి త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల‌ని ఆదేశిస్తూ హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు నోటీసులు పంపించారు. అలాగే రేపు కోర్టు ముందుకు సీజ్ చేసిన ప్ర‌దీప్ కారును కూడా తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది. నిన్న ప్ర‌దీప్, పోలీసులు నిర్వ‌హించిన కౌన్సెలింగ్‌కి హాజ‌రయ్యారు. అలాగే తర్వాతి ప్రొసీజ‌ర్‌లో కూడా పాల్గొంటాన‌ని, తాను చేసిన త‌ప్పు మ‌రెవ‌రూ చేయ‌కూడ‌ద‌ని నిన్న మీడియాతో ప్ర‌దీప్ అన్నారు.
anchor pradeep
traffic police
notice
drunk n drive

More Telugu News