raviteja: 'టచ్ చేసి చూడు' సంక్రాంతికి రావడం లేదు .. కొత్త రిలీజ్ డేట్?

  • రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు'
  • సంక్రాంతికి వస్తుందంటూ టాక్ 
  • తాజాగా ఫిబ్రవరి 2కి వాయిదా?  
రవితేజ తాజా చిత్రంగా 'టచ్ చేసి చూడు' తెరకెక్కింది. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, రాశి ఖన్నా .. శీరత్ కపూర్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. పవన్ 'అజ్ఞాతవాసి' .. బాలకృష్ణ 'జై సింహా' సినిమాలు సంక్రాంతికి వస్తున్నా, 'టచ్ చేసి చూడు' వెనక్కి తగ్గే అవకాశం లేదనే టాక్ వినిపించింది.

 కానీ తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ సినిమా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతికి సూర్య 'గ్యాంగ్' సినిమా కూడా వస్తుండటంతో, థియేటర్ల సమస్య ఏర్పడుతోంది. సహజంగానే వసూళ్లపై కూడా ఆ ప్రభావం ఉంటుంది. అందువలన 'టచ్ చేసి చూడు' నిర్మాతలు ఈ సినిమా విడుదల తేదీని ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసుకున్నట్టు సమాచారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించవలసి వుంది.    
raviteja
rashi khanna
sheerath kapoor

More Telugu News