టీమిండియా బ్యాట్స్‌మన్ యూసఫ్ పఠాన్‌పై ఐదు నెలల వేటు
- డోప్ టెస్ట్‌లో విఫలం
- టర్‌బ్యూటలైన్ పదార్థాన్ని తీసుకున్నాడని తేల్చిన బీసీసీఐ
- గతేడాది నుంచి తాత్కాలిక నిషేధం ఉండడంతో ఈ నెల 14వరకు మాత్రమే నిషేధం
టీమిండియా వైద్యులు కూడా ఈ విషయాన్ని అధికారులకు చెప్పలేదని బీసీసీఐ తెలిపింది. గతేడాది డోపింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో యూసఫ్ పఠాన్‌ను బీసీసీఐ తాత్కాలికంగా సస్పెండ్ చేయడంతో ఆయన రంజీ మ్యాచ్ లు ఆడలేదు. అయితే, బీసీసీఐ తాజాగా ఐదు నెలల నిషేధం మాత్రమే విధించింది. గత ఆగష్టు 15వ తేదీ నుంచే యూసఫ్ పఠాన్ సస్పెన్షన్‌ను ఎదుర్కుంటుండడంతో ఈ నెల 14తో ఆ సస్పెన్షన్ ముగియనుంది.