Yusuf Pathan: టీమిండియా బ్యాట్స్‌మన్‌ యూసఫ్‌ పఠాన్‌పై ఐదు నెలల వేటు

  • డోప్‌ టెస్ట్‌లో విఫలం 
  • టర్‌బ్యూటలైన్ పదార్థాన్ని తీసుకున్నాడని తేల్చిన బీసీసీఐ
  • గతేడాది నుంచి తాత్కాలిక నిషేధం ఉండడంతో ఈ నెల 14వరకు మాత్రమే నిషేధం

గత ఏడాది ఓ దేశవాళి టీ-20 మ్యాచ్‌లో నిషేధ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నందుకు టీమిండియా బ్యాట్స్‌మన్‌ యూసఫ్‌ పఠాన్‌పై ఐదు నెలల వేటు వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. డోప్‌ టెస్ట్‌లో స‌ద‌రు ఆట‌గాడు విఫలం అయిన‌ట్లు పేర్కొంది. యూస‌ఫ్ ప‌ఠాన్‌  టర్‌బ్యూటలైన్ పదార్థాన్ని తీసుకున్నాడని తేల్చి చెప్పింది. ఒకవేళ ద‌గ్గు వంటి ఏదైనా ఆరోగ్య స‌మ‌స్య ఉండి ఆటగాడు డ్రగ్‌ను తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే అనుమ‌తి తీసుకోవాల‌ని, కానీ, యూస‌ఫ్ ప‌ఠాన్ ఏ అనుమ‌తి తీసుకోలేద‌ని చెప్పింది.

టీమిండియా వైద్యులు కూడా ఈ విషయాన్ని అధికారులకు చెప్ప‌లేద‌ని బీసీసీఐ తెలిపింది. గ‌తేడాది డోపింగ్‌ ఆరోపణలు వచ్చిన నేప‌థ్యంలో యూస‌ఫ్ ప‌ఠాన్‌ను బీసీసీఐ తాత్కాలికంగా సస్పెండ్ చేయడంతో ఆయ‌న రంజీ మ్యాచ్ లు ఆడ‌లేదు. అయితే, బీసీసీఐ తాజాగా ఐదు నెల‌ల నిషేధం మాత్ర‌మే విధించింది. గ‌త ఆగష్టు 15వ తేదీ నుంచే యూస‌ఫ్ ప‌ఠాన్ స‌స్పెన్ష‌న్‌ను ఎదుర్కుంటుండ‌డంతో ఈ నెల 14తో ఆ సస్పెన్షన్‌ ముగియనుంది.

  • Loading...

More Telugu News