national anthem: సినిమా హాళ్లలో జాతీయగీతం తప్పనిసరి కాదు.. సుప్రీంకోర్టు!

  • థియేటర్లలో జాతీయగీతం తప్పనిసరి కాదు
  • గత ఆదేశాలను వెనక్కి తీసుకున్న సుప్రీం
  • నిబంధన ఉండాలనుకుంటే.. పార్లమెంటులో ఆమోదించండి

సినిమా థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు తప్పని సరిగా జాతీయగీతాన్ని ప్రదర్శించాలని, ప్రతి ఒక్కరూ ఆ సమయంలో తప్పనిసరిగా గౌరవపూర్వకంగా లేచి నిలబడాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు వెనక్కు తీసుకుంది. థియేటర్లలో జాతీయగీతం ప్రదర్శన కంపల్సరీ కాదని ఈరోజు ఉత్తర్వులను వెలువరించింది. ఒకవేళ ఈ నిబంధన ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే, తొలుత పార్లమెంటులో దాన్ని ఆమోదించాలని సూచించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News