Chandrababu: ప్రతి వార్డుకు, ప్రతి గ్రామానికి విజన్ డాక్యుమెంట్ రూపొందించండి: చంద్రబాబు ఆదేశం

  • తెలివితేటలకు టెక్నాలజీ తోడైతే అద్భుతాలు వస్తాయి
  • నదులను అనుసంధానించి మహా సంగమం చేస్తాం
  • రాయలసీమ రతనాలసీమ అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని నదులను అనుసంధానం చేసి, మహా సంగమం చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాయలసీమను రతనాలసీమగా మార్చే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన తెలిపారు. 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమానికి సంబంధించి ఆయా శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ను చంద్రబాబు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది ప్రజలను చైతన్యపరిచే సమయమని, ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు.

ప్రతి వార్డుకు, ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా విజన్ డాక్యుమెంట్లను రూపొందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మన తెలివితేటలకు టెక్నాలజీ తోడైతే అద్భుతాలను చేయగలమని చెప్పారు. ఒకవైపు డిజిటల్ లిటరసీని ప్రోత్సహిస్తూనే, మరోవైపు ఫైబర్ గ్రిడ్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్, పరిష్కార వేదిక 1100, ఈ-ప్రగతి తదితర కార్యక్రమాలన్నీ టెక్నాలజీ వినియోగానికి నిదర్శనాలని అన్నారు. అనంతపురం జిల్లా ఇండస్ట్రియల్ హబ్ గా అవతరిస్తోందని, చిత్తూరు జిల్లా హార్టికల్చర్, పారిశ్రామికంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. జన్మభూమి కార్యక్రమాలకు బ్యాంకర్లు వచ్చి రుణమేళా, బ్యాంకు లింకేజీలు ఇవ్వడం ఇదే తొలిసారని అన్నారు.

More Telugu News