Polavaram: కొత్త నాటకానికి తెరదీసిన పోలవరం కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్!

  • ట్రాన్స్ ట్రాయ్ పై కెనరా బ్యాంకు కేసు
  • అది తమ సంస్థ కాదంటున్న ట్రాన్స్ ట్రాయ్
  • కార్పొరేట్ లొసుగులను అడ్డుపెట్టుకుని కొత్త నాటకం

కెనరా బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంలో విఫలమై లా ట్రైబ్యునల్ లో కేసును ఎదుర్కొంటున్న ట్రాన్స్ ట్రాయ్ సరికొత్త నాటకానికి తెరదీసింది. పోలవరం కాంట్రాక్టు పనులను చేస్తున్నది తాము కాదని, కెనరా బ్యాంకు పిటిషన్ వేసింది తమ సంస్థపై కాదని ఈ ఉదయం ఓ ప్రకటనలో వెల్లడించింది. పోలవరం పనులను చేస్తున్నది జేఎస్ఈ, ఈసీయూఈఎస్, జాయింట్ వెంచర్ అని ట్రాన్స్ ట్రాయ్ పేర్కొంది.

కెనరా బ్యాంకు పిటిషన్ వేసింది 'ట్రాన్స్ ట్రాయ్ ఇండియా లిమిటెడ్' అనే సంస్థపై అని, అది తాము కాదని, దానికి తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. పిటిషన్ ప్రభావం పోలవరం పనులపై చూపబోదని, అసలు ట్రాన్స్ ట్రాయ్ కి ఎలాంటి బ్యాంకు వివాదాలూ లేవని చెప్పుకొచ్చింది. కాగా, కార్పొరేట్ లొసుగులను అడ్డు పెట్టుకుని ట్రాన్స్ ట్రాయ్ కొత్త డ్రామాకు తెరలేపిందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఓ కంపెనీని అనుబంధ సంస్థగా చూపించి, దాని పేరిట రుణం తీసుకుని, అది చెల్లించకుండా, అసలా సంస్థ తమది కాదని బుకాయిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు

More Telugu News