swamiji: మనశ్శాంతి దక్కని స్వామీజీ.. ఆత్మహత్య!

షార్ట్స్‌లో చూడండి
మనశ్శాంతి లేని వారికి సాంత్వన కలిగించేవారు స్వామీజీలు. అలాంటి స్వామీజీలకే మనశ్శాంతి కరువైతే? కర్ణాటక గదగ్ జిల్లా శిహట్టి తాలూకాలోని బాలేహోసూరులో ఉన్న దింగాలేశ్వర మఠంలో ఇదే జరిగింది. మఠంలో ఉండే మహాలింగ స్వామీజీ (38) మనశ్శాంతి దక్కలేదన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కలకలం రేపుతోంది.

ఆదివారం అర్ధరాత్రి సమయంలో సూసైడ్ నోట్ రాసి, ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున మఠానికి వచ్చిన భక్తులు, ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి ఎవరూ కారణం కాదని, గత కొంత కాలంగా తాను మనశ్శాంతిని కోల్పోయానని, ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆయన తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. తనను ఈ మఠంలోనే సమాధి చేయాలని కోరారు. 
Go Back to Shorts
swamiji
dingaleswara matham

More Telugu News