Hyderabad: హైదరాబాద్ లో రోడ్ల విస్తరణ... ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ మళ్లింపు!

  • బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 మరమ్మతులు
  • జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 విస్తరణ
  • ఆరు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులను విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, రహదారుల్లో ట్రాఫిక్ మళ్లింపును అమలు చేయనున్నట్టు వెల్లడించింది. రోడ్డు మరమ్మతు కారణంగా బంజారాహిల్స్ లో 15 రోజులు, జూబ్లీహిల్స్ లో ఆరు నెలల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని రహదారులు, భవనాల శాఖ స్పష్టం చేసింది.

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో 4 లేన్ కారిడార్ నిర్మాణ పనులను చేపట్టనున్నట్టు తెలిపింది. బంజారాహిల్స్ పనులు ఈ నెలాఖరులోగానే పూర్తవుతాయని, జూబ్లీహిల్స్ లో మాత్రం 4 లేన్ నిర్మాణం ఆరు నెలలు సాగుతుందని, వాహనదారులు సహకరించాలని కోరింది. రేపటి నుంచి జూలై 9 వరకూ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది.

  • Loading...

More Telugu News