ISRO: ఈ 12న నింగిలోకి 31 ఉపగ్రహాలు.. నాలుగు నెలల తర్వాత ‘ఇస్రో’ మరో అద్భుత ప్రయోగం!

  • 31 ఉపగ్రహాల్లో 28 అమెరికాకు చెందినవి 
  • ఈనెల 10న కౌంట్ డౌన్ మొదలు
  • గతేడాది ఆగస్టులో ప్రయోగం విఫలమైన తర్వాత ఇదే తొలిసారి

నాలుగు నెలల విరామం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అద్భుత ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈనెల 12న నింగిలోకి 32 ఉపగ్రహాలను పంపించేందుకు సర్వం సిద్ధం చేసింది. వీటిలో భారత్‌కు చెందిన రిమోట్ సెన్సింగ్స్ ఉపగ్రహం కార్టోశాట్-2 కూడా ఉంది. ప్రయోగానికి ఈనెల 10న కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. ఇస్రో పంపించనున్న 31 ఉపగ్రహాల్లో 28 అమెరికాకు చెందిన ఉపగ్రహాలున్నాయి.

గతేడాది ఆగస్టు 31న నెల్లూరులోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి  ప్రయోగించిన 8వ నేవిగేషన్ ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. నాలుగు నెలల తర్వాత మళ్లీ ఇక్కడి నుంచే ప్రయోగించనుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ-సి40) రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ముందుగా చెప్పినట్టుగానే ఈనెల 10న ఉపగ్రహ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలవుతుందని ఇస్రో పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ దేవి కార్నిక్ తెలిపారు. కాగా, ఈ ఏడాది ఇస్రో చేపట్టనున్న మొట్టమొదటి ప్రయోగం ఇదే అవుతుంది.

More Telugu News