nani: నాని .. కిషోర్ తిరుమల సినిమాలో కొత్త హీరోయిన్!

  • కిషోర్ తిరుమలతో నాని 
  • మల్లూవుడ్ హీరోయిన్ కే ఛాన్స్ 
  • నాని జోడీ కడితే చాలానే టాక్
విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ నాని వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఆయనతో సినిమాలు చేయడానికి ఒక వైపున దర్శక నిర్మాతలు, మరో వైపున స్టార్ హీరోయిన్స్ ఉత్సాహాన్ని చూపుతున్నారు. నాని జోడీగానే 'మజ్ను' చిత్రం ద్వారా అనూ ఇమ్మాన్యుయేల్ .. 'జెంటిల్ మేన్' చిత్రం ద్వారా నివేదా థామస్ తెలుగు తెరకు  పరిచయమయ్యారు.

ఆ సినిమాలతో సక్సెస్ లను అందుకుని, వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కిషోర్ తిరుమలతో నాని చేయనున్న సినిమాలోనూ కథానాయికగా మల్లూ బ్యూటీనే తీసుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం ఇద్దరు అమ్మాయిలను అనుకున్నారట. త్వరలోనే ఒకరిని ఎంపిక చేసి ప్రకటించనున్నారని సమాచారం. నాని సరసన నటిస్తే చాలు.. హీరోయిన్స్ దశ తిరిగిపోతుందనే ప్రచారం కూడా ఫిల్మ్ నగర్లో కొనసాగుతోంది.    
nani
kishor thirumala

More Telugu News