India: రెండో ఇన్నింగ్స్ లో 130 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్.. భారత్ విజయ లక్ష్యం 207 పరుగులు!

  • రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లలో షమీ, బుమ్రాకి మూడేసి వికెట్లు
  • ద‌క్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ 286 పరుగులు
  • టీమిండియా మొదటి ఇన్నింగ్స్ 209 పరుగులు
  • 207 పరుగులు చేస్తే భారత్ విజయం 
దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగుతోన్న తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. మార్క్ రమ్ 34, ఎల్గర్ 25, రబడా 5, ఆమ్లా 4, డివిల్లియర్స్ 35, డు ప్లెసిస్ 0, డీ కాక్ 8, ఫిలండెర్ 0, కేశవ్ మహారాజ్ 15, మార్కెల్ 2, స్టెయిన్ 0 (నాటౌట్) పరుగులకే ఒకరి తరువాత ఒకరు వెనువెంటనే వెనుదిరిగారు.

 దీంతో రెండో ఇన్నింగ్స్ లో 130 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీ, బుమ్రాకి మూడేసి వికెట్లు దక్కగా, పాండ్యా, భువనేశ్వర్ చెరో రెండు వికెట్లు తీశారు. మొదటి ఇన్నింగ్స్ లో ద‌క్షిణాఫ్రికా 286 పరుగులు చేయగా, టీమిండియా 209 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. దీంతో భారత్ విజయం సాధించాలంటే రెండో ఇన్నింగ్స్ లో 207 పరుగులు చేయాల్సి ఉంది.
India
south africa
Cricket

More Telugu News