shivani: '2 స్టేట్స్' రీమేక్ లో రాజశేఖర్ కూతురు శివాని?

  • తెలుగు తెరపైకి శివాని
  • ఉత్తరాది భామ పాత్ర
  • త్వరలో పూర్తి వివరాలు  

జీవితా రాజశేఖర్ కూతురు శివాని .. హీరోయిన్ గా వెండితెరకి పరిచయం కానుందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే ముందుగా ఆమె ఓ తమిళ సినిమా చేయనుందనీ .. ఆ తరువాత తెలుగు సినిమా చేయనుందనే టాక్ వచ్చింది. అయితే ఆమె ముందుగా ఓ తెలుగు సినిమానే చేయనుందనేది తాజా సమాచారం.

ఇది ఓ బాలీవుడ్ హిట్ మూవీకి రీమేక్. బాలీవుడ్లో 2014లో '2 స్టేట్స్' అనే సినిమా వచ్చింది.  అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో అర్జున్ కపూర్ .. అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అలాంటి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఉత్తరాది భామగా శివాని కనిపించనుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.   

More Telugu News