Rupee: తగ్గుతున్న డాలర్ విలువ... 32 నెలల గరిష్ఠానికి రూపాయి

  • కొనసాగుతున్న రూపాయి దూకుడు
  • 32 నెలల గరిష్ఠానికి రూపాయి విలువ
  • స్టాక్ మార్కెట్లు సైతం లాభాల్లో

రూపాయి దూకుడు కొనసాగుతోంది. ముఖ్యంగా డాలర్ తో రూపాయి మారకపు విలువ భారీగా లాభపడుతూ, 32 నెలల గరిష్ఠానికి దూసుకెళ్లింది. శుక్రవారం నాడు ఒక డాలర్ కు రూ. 63.37 మారకపు విలువ పలకగా, ఈ ఉదయం అది స్వల్పంగా పెరిగి రూ. 63.49 వద్ద కొనసాగుతోంది.

కరెన్సీ డీలర్ల నుంచి కొనుగోళ్లు సంతృప్తికరంగా ఉండటం, విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో డాలర్లు వస్తుండటంతో రూపాయి విలువ పెరుగుతోందని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈక్విటీ మార్కెట్లు సైతం ఈ ఉదయం లాభాల్లో నడుస్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక ఈ మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో 187 పాయింట్లు లాభపడి 34,341 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

More Telugu News