kalyan ram: నందమూరి హీరో సినిమా టైటిల్ ఖరారు!

  • జయేంద్ర దర్శకత్వంలో కల్యాణ్ రామ్ 
  • 'నా నువ్వే' టైటిల్ ఖరారు 
  • కథానాయికగా తమన్నా  
కల్యాణ్ రామ్ ఒక వైపున నిర్మాతగా రాణిస్తూనే మరో వైపున హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన జయేంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా తమన్నా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగ్ జరుపుకుంది.డిఫరెంట్ కంటెంట్ తో రూపొందుతోన్న ఈ సినిమాకి తాజాగా 'నా నువ్వే' అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్టు గ్లింప్స్ ను వదిలారు. మోర్ లవ్ .. మోర్ మేజిక్ అనేది ట్యాగ్ లైన్ ను గా ఉంచారు. కల్యాణ్ రామ్ కి ఇది 15వ సినిమా .. ఈ సినిమాలో ఆయన క్లీన్ షేవ్ తో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తుండగా .. 'లవ్ 100' ఎఫ్ ఎమ్ ఆర్జే గా తమన్నా అలరించనుంది.  చాలా గ్యాప్ తరువాత తమన్నా నుంచి వస్తోన్న సినిమా కావడం, తొలిసారిగా ఆమె కల్యాణ్ రామ్ తో జోడీ కట్టడం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. త్వరలోనే ఫస్టులుక్ ను .. ఆ తరువాత టీజర్ ను వదిలే ఆలోచనలో వున్నారు.       
kalyan ram
thamannah

More Telugu News