Anchor Pradeep: తల్లితో కలసి పోలీసు స్టేషన్ కు నేడు యాంకర్ ప్రదీప్

  • డిసెంబర్ 31న దొరికిపోయిన ప్రదీప్
  • బ్లడ్ లో ఆల్కహాల్ కౌంట్ 178
  • జైలు శిక్ష పడే అవకాశం
డిసెంబర్ 31 రాత్రి, పూటుగా మద్యం తాగి కొత్త సంవత్సరం వేడుకలు చేసుకుని, ఆపై కారు నడుపుకుంటూ వచ్చి పోలీసులకు చిక్కిన యాంకర్, నటుడు ప్రదీప్, నేడు పోలీసుల కౌన్సెలింగ్ కు హాజరు కానున్నాడు. నిబంధనల మేరకు ఆయన తన తల్లితో కలసి కౌన్సెలింగ్ కు వస్తాడని పోలీసు అధికారులు వెల్లడించారు.

ప్రదీప్ నేడు బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వస్తున్నాడని, ఈ మేరకు గతవారంలోనే తమకు సమాచారం ఇచ్చాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చిన తరువాత కోర్టు ముందు హాజరు పరుస్తామని, శిక్ష ఏంటన్నది న్యాయమూర్తి నిర్ణయిస్తారని తెలిపాయి. కాగా, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో ప్రదీప్ రక్తంలో ఆల్కహాల్ కౌంట్ 178 పాయింట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ స్థాయిలో మద్యం తాగిన వాళ్లకు రెండు నుంచి వారం రోజుల జైలుశిక్షను విధిస్తుండటంతో ప్రదీప్ కు కూడా అదే శిక్ష పడవచ్చని తెలుస్తోంది.
Anchor Pradeep
Police
Drunken Drive

More Telugu News