Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • ఐదు వేల మంది విద్యార్థులతో రకుల్ డ్యాన్స్!
  •  మంచు లక్ష్మి చిత్రానికి చిరంజీవి టైటిల్ 
  • ముంబయ్ లో సుధీర్ బాబు ట్రైనింగ్ 
  • ప్రొఫెసర్ వేషంలో వెంకటేశ్!

*  అందాలతార రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం 'అయ్యారీ' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఒక పాటలో ఆమెతో పాటుగా 5000 మంది విద్యార్థులు డ్యాన్స్ చేస్తారట. ఈ చిత్రానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు.  
*  మంచు లక్ష్మి నటించే చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ని నిర్ణయించారు. విజయ్ ఎలకంటి దర్శకత్వంలో మంచు లక్ష్మి తాను ప్రధాన పాత్ర పోషిస్తూ, ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి 'వేట' అనే చిత్రాన్ని నిర్ణయించినట్టు సమాచారం. మూడు దశాబ్దాల క్రితం చిరంజీవి 'వేట' పేరిట ఓ చిత్రాన్ని చేసిన విషయం విదితమే.
*  ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా బాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాత్ర పోషణ కోసం హీరో సుధీర్ బాబు ట్రైనింగ్ నిమిత్తం ముంబయ్ వెళుతున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుంది.
*  వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగ్ ఫిబ్రవరి నుంచి జరుగుతుంది. వెంకటేశ్ ప్రొఫెసర్ గా నటిస్తున్న ఈ చిత్రానికి 'ఆటా నాదే.. వేటా నాదే' అనే టైటిల్ని అనుకుంటున్నారు.   

More Telugu News