Vijayawada: దుర్గగుడి ఈవో సూర్యకుమారి బదిలీ.. ఇంచార్జ్ ఈఓగా దేవాదాయశాఖ కమిషనర్

  • అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
  • సూర్యకుమారిని సాధారణ పరిసాలన శాఖకు సరెండర్  
  • తాంత్రిక పూజల నిర్వహణ వెనుక సూర్యకుమారి 

విజయవాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజల నిర్వహణ వెనుక ఈవో సూర్యకుమారి ఉన్నారనే విషయం నివేదికలో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవో సూర్యకుమారిపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇంచార్జ్ ఈఓగా దేవాదాయశాఖ కమిషనర్ అనురాధకు బాధ్యతలు అప్పగించనున్నారు. సాధారణ పరిపాలన శాఖకు సూర్యకుమారిని ప్రభుత్వం సరెండర్ చేసింది.

కాగా, ఆలయ ప్రధాన అర్చకుడు బద్రీనాథ్‌, చాలా కాలంగా తన బంధువుకు ఆలయంలో ఉద్యోగం ఇప్పించాలని ఈఓ సూర్యకుమారిని అడుగుతున్నారని, తాంత్రిక పూజలు చేయిస్తే, ఆ ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె ఆశ చూపించి ఈ పని చేయించినట్లుగా దర్యాప్తులో వెలుగు చూసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News