air india: ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు ఇది తగిన సమయం కాదు: పార్లమెంటరీ ప్యానల్

  • ఇప్పుడిప్పుడే లాభాల దశలోకి ప్రవేశిస్తోంది
  • పునరుద్ధరణకు ఐదేళ్ల గడువు ఇవ్వాలి
  • ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించాలి

ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు ఇది తగిన సమయం కాదని, పునురుద్ధానం కావడానికి, రుణాలను తీర్చివేసేందుకు వీలుగా కనీసం ఐదేళ్ల సమయం ఇవ్వాలని పార్లమెంటరీ ప్యానల్ తన ముసాయిదా నివేదికలో సూచించింది. ఎయిర్ ఇండియాను పునరుద్ధరించే ప్రణాళిక కింద ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఓ ముద్ద మాత్రమేనని, ఇది ఎయిర్ ఇండియా నిర్వహణ తీరును దెబ్బతీయడమే కాకుండా అధిక వడ్డీకి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితికి దారితీసినట్టు ప్యానల్ తన నివేదికలో ప్రస్తావించింది.

ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తప్పకుండా సమీక్షించాలని కోరింది. విపత్తులు, సామాజిక లేదా రాజకీయ అశాంతి నెలకొన్న సమయాల్లో ఎయిర్ ఇండియా అందించిన సేవలను గుర్తు చేసింది. అన్ని భాగస్వాముల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత, లాభాల దశలోకి ప్రవేశిస్తున్న దశలో ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించడం సరికాదని తాము భావిస్తున్నట్టు ప్యానల్ తన నివేదికలో పేర్కొంది.

More Telugu News