Pawan Kalyan: ‘జనసేన’ ఎంబ్లమ్ తాంత్రిక ముగ్గు లాగానే ఉంటుంది: మహేశ్ కత్తి

  • ‘జనసేన’ ఎంబ్లమ్ ను జాగ్రత్తగా గమనించండి 
  • ఆ తరహా పరిజ్ఞానం ఉన్న వాళ్లకు ఈ విషయం అర్థమౌతుంది
  • పవన్, త్రివిక్రమ్ తాంత్రిక పూజల వీడియోలో వున్నది వాళ్లిద్దరే
  • ఇందుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలు ఉన్నాయి 

‘జనసేన’ ఎంబ్లమ్ తాంత్రిక ముగ్గును తలపించే విధంగా ఉంటుందని ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ ఆరోపించారు. ‘టీవీ 9’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,‘జనసేన’ ఎంబ్లమ్ ను జాగ్రత్తగా గమనిస్తే బాగుంటుందని, ఆ తరహా విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్లకు ఈ విషయం అర్థమౌతుందని అభిప్రాయపడుతున్నానని మహేష్ అన్నారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కలిసి తాంత్రిక పూజలు నిర్వహించిన విషయం తనకు తెలుసు గానీ, ఎప్పుడు, ఎక్కడ నిర్వహించారనేది తనకు తెలియదని అన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోలో వాళ్లిద్దరూ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోందని, ఆ వీడియోలో వున్నది పవన్, త్రివిక్రమ్ అని ఇందుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలు కూడా ఉన్నాయని అన్నారు. ఆ వీడియోలో వున్నది మేము కాదు, ఆ స్వరాలు మావి కాదు అని వాళ్లిద్దరూ తప్పించుకునేందుకు కూడా వీలులేదని ఆరోపించారు.

More Telugu News