Kathi Mahesh: పూనమ్ కౌర్ ను ఎదుర్కొనేందుకు నేను సిద్ధమే!: కత్తి మహేశ్

  • పూనమ్ కౌర్ పై ప్రశ్నలు లేవనెత్తాను.. సమాధానాలు కావాలి 
  • ఆమెను ‘మా’ ప్రశ్నించాలి..నిజమో? కాదో? తెలుసుకోవాలి
  • నిజం కాకపోతే నాపై చర్యలు తీసుకోవచ్చు: కత్తి మహేశ్

పవన్ కల్యాణ్ - పూనమ్ కౌర్ పై ఆరోపణలు గుప్పించిన కత్తి మహేశ్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) తరపున చర్యలు తీసుకుంటామని ‘టీవీ9’ లైవ్ ప్రోగ్రామ్ లో హాస్యనటుడు వేణుమాధవ్ హెచ్చరించారు. ‘మా’ సభ్యురాలు అయిన పూనమ్ కౌర్ పై ఆరోపణలు చేసిన కత్తి మహేశ్ పై చర్యలు తీసుకుంటానని వేణుమాధవ్ అన్నారు.

ఈ వ్యాఖ్యలపై కత్తి మహేశ్ స్పందిస్తూ, ‘పూనమ్ కౌర్ గురించి నేను కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను. వాటికి సమాధానాలు ఆశిస్తున్నాను. ఒకవేళ, నన్ను మా అసోషియేషన్ పిలిచి ఈ విషయమై ప్రశ్నిస్తే వాటికి సమాధానాలు కావాలని చెబుతాను. ఆమె (పూనమ్ కౌర్)ను పిలిచి ‘మా’ కూడా అడగాలి కదా? నిజమో కాదో తెలుసుకోవాలి కదా? నిజం కాకపోతే నా మీద చర్యలు తీసుకుంటామని చెబుతారు. నేను ఆశిస్తున్నదీ ఇదే! పూనమ్ కౌర్ ‘మా’ అసోసియేషన్ కి వెళ్లినా లేదా కోర్టుకెళ్లినా కూడా ఎదుర్కొనేందుకు నేను సిద్ధమే’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News