మాజీ రాష్ట్రపతులు, ప్రధానులకు అధికారిక నివాసాల సౌకర్యంపై పిల్.. సుప్రీంకోర్టులో విచారణ!
- సుప్రీంకోర్టు ముందుకు ఓ పిల్
- ప్రముఖులకు అధికారిక నివాసాలు కేటాయించడాన్ని సవాలు
- మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు ఎందరో అధికారిక నివాసాల్లో
మాజీ ముఖ్యమంత్రులకు అధికారిక నివాసాల కేటాయింపును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేయడాన్ని సవాలు చేస్తూ లోక్ ప్రహరి అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిల్ దాఖలు చేసింది. దీంతో ఈ విషయంలో కోర్టు సహాయకుడిగా మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యంను సుప్రీంకోర్టు నియమించింది. ‘‘ఈ పిటిషన్ లో లేవనెత్తిన అంశం ప్రజా ప్రయోజనాల కోణంలో పలు ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఈ తరహా చట్టాలు, కేంద్ర చట్టం ఉంటే వాటిపైనా దీని ప్రభావం ఉండొచ్చు. దీంతో ఈ అంశంలో దాగున్న అంశాలను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.