Kathi Mahesh: ఐయాం రెడీ... వచ్చేశాను... ఎవరు వస్తారో చూస్తా: కత్తి మహేష్

  • ప్రెస్ క్లబ్ కు వచ్చిన కత్తి మహేష్
  • పావు గంట పాటు వేచి చూస్తానని వెల్లడి
  • ఆ తరువాత తన వాదన వినిపిస్తానన్న కత్తి
కొద్దిసేపటి క్రితం సినీ విమర్శకుడు కత్తి మహేష్ హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చాడు. ముందుగా తాను చెప్పినట్టుగానే వచ్చానని, పవన్ కల్యాణ్, పూనం కౌర్ లేదా వారి తరఫున ఎవరు తనతో చర్చించేందుకు వస్తారో చూస్తున్నానని అన్నాడు. తన సొంత కారును వదిలేసి, ఓలా క్యాబ్ ను బుక్ చేసుకుని ప్రెస్ క్లబ్ కు వచ్చిన ఆయన, తనను చుట్టుముట్టిన మీడియాతో మాట్లాడుతూ, ముందుగా చెప్పినట్టుగానే తాను వచ్చేశానని, ఇప్పుడు చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు.

మరో పది నిమిషాలు లేదా పావుగంట పాటు పవన్ తరఫున ఎవరు వస్తారో చూస్తానని, ఎవరూ రాకుంటే, తాను చెప్పదలచుకున్నది చెప్పి వెళ్లిపోతానని అన్నాడు. తన చాలెంజ్ ని ఎవరైనా స్వీకరిస్తారేమో వేచి చూస్తానని చెప్పాడు. ఇదిలావుండగా, ఆ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు, అక్కడికి చేరుకున్న పవన్ కల్యాణ్ అభిమానులను ఎవరినీ గేటు దాటి లోనికి వచ్చేందుకు అనుమతించడం లేదు.
Kathi Mahesh
Pawan Kalyan
Press Club

More Telugu News