Hyderabad: జూబ్లీహిల్స్ పోలీసులకు చుక్కలు చూపించిన పెద్దింటమ్మాయిలు!

  • జూబ్లీహిల్స్ ఏరియాలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
  • ఖరీదైన కార్లలో వచ్చిన అమ్మాయిల హంగామా
  • పోలీసుల సహనానికి పరీక్ష
నిన్న రాత్రి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్ ఏరియాలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా, ఖరీదైన కార్లలో వచ్చిన బడాబాబుల అమ్మాయిలు కాసేపు నానా హంగామా చేశారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలకు సహకరించకుండా పోలీసుల సహనాన్ని పరీక్షించారు. కాసేపు కారు డోర్లు తీయకుండా మొరాయించారు. మందు కొట్టి ఖరీదైన కార్లలో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. వారి కార్లను బలవంతంగా పక్కకు తీయించిన పోలీసులు, మహిళా కానిస్టేబుళ్ల సాయంతో వారికి పరీక్షలు నిర్వహించి, వారంతా మద్యం తాగినట్టు తేల్చి కార్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి జరిపిన తనిఖీల్లో మొత్తం 14 మంది దొరికిపోయారని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఆపై కోర్టు ముందు హాజరు పరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
Hyderabad
Drunken Drive
Jubileehills
Drunken Ladies

More Telugu News