sonam: త్వ‌రలో బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ అహూజాను పెళ్లిచేసుకోబోతున్న సోన‌మ్‌?

  • ఏప్రిల్ లో పెళ్లి అంటూ వార్త‌లు
  • కాదంటున్న సోన‌మ్‌, అహూజా స‌న్నిహితులు
  • క‌జిన్ పెళ్లిని త‌న పెళ్లిగా చిత్రీక‌రిస్తున్నార‌ని వ్యాఖ్య‌

బాలీవుడ్ సుంద‌రి సోన‌మ్ క‌పూర్, త‌న బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ అహూజాల మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం న‌డుస్తున్న‌ట్లు గ‌తంలో వ‌చ్చిన వార్త‌ల‌ను ఆమె తీవ్రంగా ఖండించిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ వారిద్ద‌రూ క‌లిసి క్రిస్‌మ‌స్‌, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌కు హాజ‌రుకావ‌డం, ఇత‌ర వేడుక‌ల‌కు వెళ్లిన‌పుడు చాలా సన్నిహితంగా మసలడం చూసిన వారంతా వాళ్ల మధ్య కచ్చితంగా ప్రేమ చిగురించిందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇటీవ‌ల వారిద్ద‌రి ఫొటోల‌ను కూడా సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా షేర్ కూడా చేస్తున్నారు.

దీంతో త్వ‌ర‌లో వాళ్లిద్ద‌రూ వివాహం చేసుకోబోతున్నార‌ని కొత్త‌గా వార్త‌లు వ‌స్తున్నాయి. ఏప్రిల్‌లో జోధ్‌పూర్‌లో వివాహం జ‌ర‌గ‌నుందని, అతికొద్ది మంది బంధువుల స‌మ‌క్షంలో ఈ వేడుక జ‌రగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తను సోన‌మ్‌, అహూజాల స‌న్నిహితులు ఖండిస్తున్నారు. జోధ్‌పూర్‌లో జ‌ర‌గ‌బోయే వివాహం సోనమ్ క‌జిన్ మోహిత్ మార్వాద‌ని, అంద‌రూ క‌లిసి ప‌నిచేస్తుండ‌టంతో సోన‌మ్‌ పెళ్లిగా అంద‌రూ భ్ర‌మ‌ప‌డుతున్నార‌ని వారు చెబుతున్నారు. అయితే విరుష్క జంట కూడా పెళ్లికి ముందు ఇలాగే అన్నార‌ని, చివరికి హఠాత్తుగా పెళ్లి చేసేసుకున్నారన్న విషయాన్ని మరికొందరు గుర్తుచేస్తున్నారు.

  • Loading...

More Telugu News