aadi pinisetty: హీరోగా ఆది పినిశెట్టి మూవీకి ముహూర్తం ఖరారు

  • మళ్లీ హీరోగా ఆది పినిశెట్టి 
  • హీరోయిన్స్ గా తాప్సీ .. రితికా సింగ్ 
  • ఈ నెల 10 నుంచి షూటింగ్
కుదిరితే హీరోగా .. లేదంటే విలన్ గా చేస్తూ ఆది పినిశెట్టి తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తెలుగు .. తమిళ చిత్రాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యంగ్ హీరోల సినిమాల్లో విలన్ గా వరుస సినిమాలు చేస్తోన్న ఆది పినిశెట్టి, త్వరలో హీరోగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

'గీతాంజలి' నిర్మాతలతో కలిసి కోన వెంకట్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, హరనాథ్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ఆది పినిశెట్టి సరసన కథానాయికలుగా, తాప్సీ .. రితికా సింగ్ నటించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాతో ఆది పినిశెట్టి హీరోగానూ మళ్లీ బిజీ అవుతాడేమో చూడాలి.     
aadi pinisetty
tapsee
rithika

More Telugu News