India: ఏడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

  • దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో భారత్, సౌతాఫ్రికా తొలి టెస్టు
  • రాణిస్తోన్న భారత బౌలర్లు
  • ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 238/7 (55 ఓవర్లకి)

దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగుతోన్న భారత్, సౌతాఫ్రికా తొలి టెస్టులో భారత బౌలర్లు రాణిస్తుండడంతో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్‌లో డీన్ ఎల్గర్ 0, మార్క్‌రం 5, ఆమ్లా 3, డివిల్లియర్స్ 65, ప్లెస్సిస్ 62, డి కాక్ 43, ఫిలండెర్ 23 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో కేశవ్ మహరాజ్ 26, రబాడా 2 పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీయగా షమీ, బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు చెరో వికెట్ లభించాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 238/7 (55 ఓవర్లకి) గా ఉంది.

More Telugu News