pm narendra modi: ప్ర‌ధాని మోదీకి చాక్‌పీస్ కళాకృతుల బ‌హుమ‌తి!

  • అంద‌జేసిన క‌ళాకారుడు స‌చిన్ సంఘే
  • చాక్‌పీస్‌తో యోగాస‌నాల బొమ్మలు
  • త‌ల్లితో క‌లిసి ఉన్న మోదీ బొమ్మ కూడా

చాక్‌పీస్ మీద‌ యోగాస‌నాల బొమ్మ‌లు, త‌ల్లి హీరాబెన్‌తో మోదీ క‌లిసి ఉన్న బొమ్మ‌ను చెక్కి సచిన్ సంఘే అనే క‌ళాకారుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి బ‌హుమ‌తిగా అంద‌జేశారు. ఈ విష‌యాన్ని ఫొటోల‌తో స‌హా ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం ట్వీట్ చేసింది. సచిన్ బహూక‌రించిన యోగాస‌నాల చాక్‌పీస్ బొమ్మ‌లు, మోదీ చాక్‌పీస్ బొమ్మ చాలా బాగున్నాయి. స‌చిన్ సంఘే త‌న‌ను తాను చాల్కృతి అని అభివ‌ర్ణించుకుంటార‌ని ట్వీట్‌లో పీఎంఓ పేర్కొంది.
 

More Telugu News