anchor: యాంకర్ ప్రదీప్‌కి మరో రెండు రోజుల సమయం: పోలీసుల డెడ్ లైన్

  • ఎవ్వ‌రికీ క‌న‌ప‌డ‌కుండా ఉంటోన్న యాంకర్ ప్రదీప్
  • డ్రంకెన్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డిన వారంద‌రికీ కౌన్సెలింగ్ ఇస్తాం
  • కౌన్సెలింగ్‌కు పెళ్లికాని వారు త‌ల్లిదండ్రుల‌తో కలిసి రావాలి 
  • గ‌డువులోగా రాక‌పోతే ఛార్జిషీట్ న‌మోదు చేస్తాం-ట్రాఫిక్ అద‌న‌పు డీసీపీ

మద్యం తాగి కారు న‌డుపుతూ పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయిన ప్ర‌ముఖ యాంక‌ర్ ప్ర‌దీప్ ఎవ్వ‌రికీ క‌న‌ప‌డ‌కుండా ఉంటోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌దీప్‌ కౌన్సెలింగ్‌కు హాజ‌రుకావ‌డానికి ఐదు రోజుల స‌మ‌యం ఇచ్చామ‌ని, మ‌రో రెండు రోజులు ఎదురు చూస్తామ‌ని ట్రాఫిక్ అద‌న‌పు డీసీపీ అమ‌ర్‌కాంత్‌రెడ్డి ఈ రోజు మీడియాకు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డిన వారంద‌రికీ కౌన్సెలింగ్ ఇస్తామ‌ని, ప్ర‌దీప్ రేపు లేక సోమ‌వారం వ‌స్తార‌ని అనుకుంటున్నామ‌ని అన్నారు. కౌన్సెలింగ్‌కు పెళ్లికాని వారు త‌ల్లిదండ్రుల‌తోను, పెళ్ల‌యిన వారు భార్య‌తోను రావాలని చెప్పారు. గ‌డువులోగా రాక‌పోతే ఛార్జిషీట్ న‌మోదు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

More Telugu News