akshay kumar: సిక్కు వేషధారణలో అక్ష‌య్ కుమార్‌.. ఆక‌ట్టుకుంటున్న 'కేస‌రి' ఫ‌స్ట్‌లుక్‌

  • ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన అక్ష‌య్‌
  • చారిత్ర‌క క‌థాంశంతో తెర‌కెక్కుతున్న చిత్రం
  • 2019 హోలీకి విడుదల ‌ 

అక్ష‌య్ కుమార్ న‌టించిన 'ప్యాడ్ మ్యాన్' చిత్రం విడుద‌లకు సిద్ధంగా ఉండ‌గానే త‌న త‌దుప‌రి చిత్రం 'కేస‌రి'కి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను ఆయ‌న షేర్ చేశారు. ఈ ఫ‌స్ట్‌లుక్‌లో మీసాలు, గ‌డ్డంతో సిక్కుల సంప్రదాయ టర్బన్ ధ‌రించి ఉన్న అక్ష‌య్‌ని చూడొచ్చు. గ‌తంలో చాలా సినిమాల్లో అక్ష‌య్ సిక్కు టర్బన్ ధ‌రించి న‌టించాడు. చారిత్ర‌క క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది.

2018లో త‌న మొద‌టి ప్రాజెక్టు అంటూ అక్ష‌య్ ఈ ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫ‌స్ట్‌లుక్‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతూ నిర్మాత క‌ర‌ణ్ జొహార్ కూడా ట్వీట్ చేశాడు. 2019 హోలీ సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు క‌ర‌ణ్ గ‌తంలో ప్ర‌క‌టించాడు. బ్రిటీష్ ఇండియ‌న్ బృందాల‌కు, ఆఫ్ఘ‌నిస్థాన్ బృందాల‌కు మ‌ధ్య జ‌రిగిన స‌రాగ‌ర్హి యుద్ధం నేప‌థ్యంలో ఈ క‌థ నడుస్తుంది. ఈ చిత్రానికి అనురాగ్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

More Telugu News