Iran: కులభూషణ్ జాదవ్ ను పాక్ కు అప్పగించింది ఇతనే!

  • సర్బాజ్ పట్టణంలో ఉగ్ర సంస్థకు దొరికిన జాదవ్
  • ఆపై పాక్ కు అప్పగింత
  • ముల్లా ఒమర్ ఇరానీ పనే ఇది
  • ఫోటో విడుదల చేసిన భద్రతా దళాలు

ఇరాన్ లో ఉన్న చాబహార్ పోర్టుకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని సర్బాజ్ పట్టణంలో ఉన్న భారత నేవీ ఉద్యోగి కులభూషణ్ జాదవ్ ను కిడ్నాప్ చేసి, పాకిస్థాన్ కు అప్పగించారని, జైషే ఉల్ అదిల్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ముల్లా ఒమర్ ఇరానీ అనే వ్యక్తి, జాదవ్ ను కిడ్నాప్ చేశాడని భారత భద్రతా దళాలు గుర్తించి, అతని ఫోటోను విడుదల చేశాయి.

 లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉంటూ, పాక్ సైన్యంతో కలసి పనిచేస్తున్న జైషే ఉల్ అదిల్, బెలూచిస్థాన్ ప్రాంతంలో ఉద్యమాన్ని అణగదొక్కడంలో సహకరిస్తోందని, హఫీజ్ సయీద్ ఆదేశాలతో ఇరాన్ లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ సంస్థకు ఇరాన్, బెహ్రయిన్ తదితర ప్రాంతాల్లోని పాకిస్థాన్ ఎంబసీలు నిధులందిస్తున్నాయని తెలిపారు. కాగా, పాకిస్థాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ జాదవ్‌ మాట్లాడినట్టున్న ఓ వీడియో ప్రకటన విడుదలైన కొద్దిసేపటికే అతన్ని కిడ్నాప్‌ చేసిన వ్యక్తి వివరాలను భారత్ బహిర్గతం చేయడం గమనార్హం.

More Telugu News