rakhi sawant: రాఖీ సావంత్‌పై ప‌రువు న‌ష్టం దావా వేసిన హ‌నీప్రీత్ త‌ల్లి!

  • రూ. 5 కోట్ల నష్టపరిహారానికి నోటీసు పంపించిన ఆశా త‌నేజా
  • 30రోజుల్లోగా క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేయాలని వ్యాఖ్య‌
  • హ‌నీప్రీత్ మీద త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేసింద‌ని ఆరోప‌ణ‌

డేరా బాబా ప్రియురాలు హ‌నీప్రీత్ గురించి త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేసింద‌ని ఆరోపిస్తూ ఆమె త‌ల్లి ఆశా త‌నేజా, బాలీవుడ్ న‌టి రాఖీ సావంత్‌కి ప‌రువున‌ష్టం దావా నోటీసులు పంపింది. త‌మ లాయ‌ర్ మోమిన్ మాలిక్ ద్వారా రూ. 5 కోట్ల నష్టపరిహారానికి నోటీసును పంపించింది. అంతేకాకుండా రాఖీ చేసిన వ్యాఖ్య‌ల‌కు 30 రోజుల్లోగా క్ష‌మాప‌ణ‌లు తెలియజేయాల‌ని నోటీసులో పేర్కొంది. డేరా బాబా గుర్మీత్ సింగ్‌, హ‌నీప్రీత్ ఇన్సాన్‌ల మ‌ధ్య ఉన్న సంబంధం గురించి రాఖీ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడి హ‌నీప్రీత్‌కి చెడ్డ పేరు తీసుకువ‌చ్చిన కార‌ణంగా ఈ దావా వేస్తున్న‌ట్లు ఆశా త‌నేజా వెల్ల‌డించింది.

గుర్మీత్ సింగ్‌తో ఒక‌ప్పుడు మంచి స్నేహం న‌డిపిన రాఖీ సావంత్, ప్ర‌స్తుతం ఆయ‌న జీవిత క‌థ ఆధారంగా 'అబ్ హోగా ఇన్సాఫ్‌' అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది. ఇందులో హ‌నీప్రీత్ పాత్ర‌ను ఆమె పోషిస్తోంది. దీనికి సంబంధించి ఓ ఇంట‌ర్వ్యూలో గుర్మీత్ బాబాకు తాను ద‌గ్గ‌ర‌వుతుండ‌టాన్ని హ‌నీప్రీత్ జీర్ణించుకోలేకపోయింద‌ని రాఖీ పేర్కొంది. ఆ వ్యాఖ్య‌లు హ‌నీప్రీత్ వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రిచేట్లుగా ఉన్నాయ‌ని ఆశా త‌నేజా తెలిపారు.

  • Loading...

More Telugu News