'టైగర్ నాగేశ్వర్ రావ్' పాత్రలో రానా?
- వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తోన్న రానా
- ఆయనను సంప్రదిస్తోన్న దర్శకుడు వంశీకృష్ణ
- నిర్మాతగా అనిల్ సుంకర
'కిట్టు వున్నాడు జాగ్రత్త' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న దర్శకుడు వంశీకృష్ణ, 'టైగర్ నాగేశ్వర్ రావ్' జీవితచరిత్రను తెరకెక్కించనున్నాడు. ఒకప్పుడు గజదొంగలా మారి .. రాబిన్ హుడ్ అనిపించుకున్న 'టైగర్ నాగేశ్వర్ రావ్' పాత్ర కోసం ఆయన రానాను సంప్రదిస్తున్నాడట. రానా ఓకే చెప్పే అవకాశం ఉందనీ .. ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించనున్నారని చెబుతున్నారు.