లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో జడ్జికి ఫోన్ల మీద ఫోన్లు!
- దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేతకు రేపు శిక్ష ఖరారు
- లాలూ కోసం చాలా రిఫరెన్స్‌లు వచ్చాయి
- కానీ చట్ట ప్రకారం నడుచుకుంటా
- సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి శివపాల్ సింగ్
కాగా, దోషి లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో తనకు కొందరి నుంచి ఫోన్లు వచ్చినట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి శివపాల్ సింగ్ చెప్పారు. లాలూ కోసం చాలా రిఫరెన్స్‌లు వచ్చాయని, కానీ తాను మాత్రం చట్ట ప్రకారం నడుచుకుంటానని అన్నారు. తనకు ఎవరెవరు ఫోన్‌లు చేశారు? ఏం మాట్లాడారు? అన్న విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.