Kajal Agarwal: ఆసక్తిని రేకెత్తిస్తూ 'అ!' సినిమా నుంచి టీజర్ వచ్చేసింది

  • నాని నిర్మాతగా తెరకెక్కుతోన్న 'అ!' మూవీ 
  • దర్శకుడిగా ప్రశాంత్ వర్మ 
  • ప్రధాన పాత్రల్లో కాజల్ .. రెజీనా .. నిత్యామీనన్

నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'అ!' సినిమా రూపొందుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి, కొంత సేపటి క్రితమే టీజర్ ను రిలీజ్ చేశారు. ఓ చేపకి .. చెట్టుకి జరిగే సంభాషణతో ఈ టీజర్ మొదలైంది. చేపకు నాని వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.

ప్రధాన పాత్రధారులైన కాజల్ .. రెజీనా .. నిత్యా మీనన్.. మురళీశర్మ .. ప్రియదర్శినిలను కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. అంతా కూడా డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తూ ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సస్పెన్స్ కి .. కామెడీకి ప్రాధాన్యతనిస్తూ అందుకు సంబంధించిన దృశ్యాలతో ఈ టీజర్ ను వదిలారు. ఈ సినిమాకి కథే హీరో అనే విషయాన్ని కూడా వాయిస్ ఓవర్ ద్వారానే చెప్పించేశారు. మొత్తం మీద కథ నేపథ్యం ఏమిటి? అనే విషయాన్ని రివీల్ చేయకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ టీజర్ ను కట్ చేశారు.

More Telugu News